బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (15:14 IST)

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రద్ధా కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.. సమంతలా?

Shraddha Kapoor
Shraddha Kapoor
శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బిటౌన్‌లో హాటెస్ట్ పేరు. ముఖ్యంగా స్త్రీ 2 భారీ విజయం తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఇది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. తాజాగా శ్రద్ధా కపూర్ పుష్ప 2: ది రూల్‌లో ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లో కనిపించవచ్చని టాక్ వస్తోంది. 
 
ఈ పాటలో స్టెప్పులేసేందుకు చాలామంది రేసులో ఉండగా, మేకర్స్ చివరికి శ్రద్ధాను ఎంచుకున్నారని టాక్. పుష్ప 2లోని ఐటమ్ సాంగ్ ద్వారా ఆమెకు ఇంకా మంచి హైప్ దక్కుతుందని సమాచారం. 
 
ఇకపోతే మొదటి పుష్పలోని ఊ అంటావా ఐటెమ్ నంబర్‌కు ముందు, సమంత కూడా సెన్సిటివ్ రోల్స్ చేసింది. ఈ పాటకు తర్వాతే ఆమెకు సిటాడెల్ వంటి బోల్డ్ ఆఫర్స్ వచ్చాయని సమాచారం.