మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (09:05 IST)

పుష్ప 2 రిలీజ్ డేట్ మారనుందా? ఓవర్ సీస్ ఒత్తిడే కారణమా?

Pushpa new poster
Pushpa new poster
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్  6న విడుదలచేయాలని ముందునుంచీ ప్రచారం చేశారు. అందుకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా పై నెగెటివ్ ప్రచారం కూడా జరిగింది. అల్లు అర్జున్ వ్యక్తిగత ఐడియాకూ సినిమాకూ లింక్ పెడుతూ చాలా కథనాలు వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్ ప్రమోషన్ ను పెద్ద ఎత్తున చేపట్టారు. దేవర సినిమాను మించి వుండాలనేట్లుగా ప్రీబుకింగ్ ఏర్పాటు చేస్తే విదేశాల్లో మంచి గిరాకీ తగిలింది. 600 కోట్ల వసూలు ఇప్పటికే అయిందని చిత్ర యూనిట్ ఓ లెక్క చెబుతోంది. మొత్తంగా చూస్తే వెయ్యికోట్లకు పైగా వసూలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
 
దీనిపై ఈరోజు జరగబోయే పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల మీటింగ్ లో అసలు వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్ నుంచి లండన్ వరకు పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తగ్గేదేలే అన్నట్లుగా వసూళ్ళు రాబడుతుందని ప్రచారం జరుగుతుంది.
 
అయితే ఈ సినిమాను కేవలం ఓవర్ సీస్ ద్రుష్టిలో పెట్టుకుని డిసెంబర్ 6న విడుదలకావాల్సిన సినిమాను డిసెంబర్ 4నే ఓవర్ సీస్ లో విడుదల చేయాలనీ, 5వ తేదీ ఇండియాలో విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి వివరాలు తెలియనున్నాయి. రస్మిక మందన్న నాయికగా నటించిన ఈ సినిమా ఫాజిల్ ప్రతినాయకుడిగా, సునీల్, అనసూయ మరో కీలక పాత్రల్లో నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను మైత్రీమూవీస్ బేనర్ పై నిర్మించగా, సుకుమార్ రైటింగ్స్ సంస్థ కూడా పాలుపంచుకుంది.