సైబర్ నేరాల కట్టడి.. బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించేందుకు హీరోయిన్ రష్మిక ముందుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం డీప్ ఫేక్ బారిన పడిన రష్మీక, సైబర్ క్రైమ్‌పై అవగాహన అవసరమని పునరుద్ఘాటించింది. "మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాము. సైబర్ క్రైమ్ అత్యధిక స్థాయిలో ఉంది.
దాని ప్రభావాన్ని అనుభవించిన వ్యక్తిగా, మన ఆన్‌లైన్ ప్రపంచాన్ని రక్షించడానికి కఠినమైన చర్యలకు ఇది సమయం అని నేను నమ్ముతున్నాను. మన కోసం, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను నిర్మించేందుకు మనం ఏకం అవుదాం.
నేను 14Cకి బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టినందున.. సైబర్ నేరాల నుండి మీలో వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించాలని, రక్షించాలనుకుంటున్నాను. సైబర్ నేరాలను నివేదించడానికి నాతో పాటు, భారత ప్రభుత్వం మీకు సహాయపడుతుంది" అంటూ రష్మిక వీడియో ద్వారా తెలియజేసింది.