గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (10:03 IST)

విజయవాడ - విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు

airindia
విజయవాడ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. 
 
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది. 
 
అలాగే, ఇండిగో విమాన సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ - విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది.