న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలో ఆగింది.. ఎందుకని? (video)
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలో ఆగింది.. ఎందుకని ఆరాతీస్తే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు. సోమవారం ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్నది.
ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఈ విమానం నుంచి ప్రయాణికులను అంతా దించివేశారు. ఆపై ఐసోలేషన్ రన్‌వేకు తరలించారు.
ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది.
కాగా, గత నెలలో ముంబైకి చెందిన మరో ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో దాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానం వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై రాసివున్న బాంబ్ ఇన్ ఫ్లైట్ అనే మేసేజ్‌ను గుర్తించారు.