ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం: 2 గంటలుగా ఆకాశంలోనే తిరుగుతోంది
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుచ్చి నుండి షార్జాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం హైడ్రాలిక్ వైఫల్యాన్ని ఎదుర్కొంది. దీనితో తిరుచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి పైలెట్లు అనుమతి కోరారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానంలో ఇంధనాన్ని తగ్గించడానికి ప్రస్తుతం విమానం గాలిలో తిరుగుతోంది.
తిరుచ్చి నుండి షార్జాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. తిరుచ్చి విమానాశ్రయంలో దిగడానికి ముందు ఇంధనాన్ని తగ్గించడానికి గగనతలంలో తిరుగుతోందనీ, ల్యాండింగ్‌కు సన్నాహకంగా, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి, అనుకోని ప్రమాదాలను నివారించడానికి విమానాశ్రయంలో 20కి పైగా అంబులెన్స్‌లు, ఫైర్ టెండర్లను మోహరించినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తెలిపారు.