ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (12:08 IST)

డాక్టర్‌ని జుట్టు పట్టుకుని స్టీల్ ఫ్రేమ్‌‌కు తలను కొట్టిన పేషెంట్.. ఎక్కడ? (video)

Doctor
Doctor
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆసుపత్రి వార్డులో మహిళా డాక్టర్‌పై ఒక రోగి దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో దాడి చేసిన వ్యక్తి డాక్టర్‌ని ఆమె జుట్టు పట్టుకుని, ఆసుపత్రి బెడ్‌లోని స్టీల్ ఫ్రేమ్‌కి ఆమె తలను కొట్టినట్లు వెల్లడైంది. వార్డ్‌లోని ఇతర వైద్యులు అడ్డుకున్నారు.
 
శనివారం ఉదయం తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రి నుంచి స్పృహలో లేని ఓ పేషెంట్‌ను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. మద్యానికి బానిసగా మారిన బంగారు రాజు అనే వ్యక్తి.. తిరుమలలో మద్యం దొరక్కపోవటంతో స్పృహ కోల్పోయాడు. 
 
అతన్ని గమనించిన కొంతమంది అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం బంగారు రాజును అశ్వినీ ఆస్పత్రి నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి మార్చారు. 
 
శనివారం తాను ఎమర్జెన్సీ వార్డులో విధుల్లో ఉండగా రోగి బంగార్రాజు ఒక్కసారిగా తన వెనక నుంచి దాడిచేసి తన జుట్టును బలంగా పట్టుకుని ఆసుపత్రి బెడ్‌ స్టీల్ ఫ్రేమ్ కేసి బాదాడాని స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్‌కు బాధిత వైద్యురాలు ఫిర్యాదు చేసింది.