ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి
నన్నే చూసే నీ అందమైన కనులు
నా రూపాన్నే నింపుకున్న నీ కంటి పాపలు
నా కోసమే ఎదురుచూసే నీ తేనె కన్నులు
నా రూపాన్ని దాచుకునే నీ కనురెప్పలు
నా ప్రేమను కామించే నీ కలువ నయనాలు
నా ఆనందాన్నే కాంక్షించే నీ కమనీయ చక్షువులు
నాతో ఏకమయ్యేందుకు నిరీక్షించే నీ నిబిడ నేత్రములు
నాకై నీ తనువంతా నయనాలుగా మలిచి
మరులుగొలిపే నా సఖీ ఐ లవ్ యు
నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి