బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (18:24 IST)

లవ్ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి, హైదరాబాద్ జీపీఆర్ మాల్ లో ఘటన

Spectator attack on Love Reddy actor
Spectator attack on Love Reddy actor
థియేటర్స్ విజిట్ కు వెళ్లిన "లవ్ రెడ్డి" చిత్రబృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో చోటు చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ఆ ప్రేమజంటను విడిదీశాడని అనుకుని కోపంతో తిడుతూ దాడి చేసింది. 
 
ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర టీమ్ మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని ఆమెకు నచ్చజెప్పారు. ఎన్ టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదంటూ మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఈ నెల 18న థియేటర్స్ లోకి వచ్చిన "లవ్ రెడ్డి" సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఎమోషనల్ ప్రేమకథగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోందీ సినిమా.