బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (13:01 IST)

సంక్రాంతి రేసులో 'ఎఫ్-3' - క్లారిటీ ఇచ్చిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎఫ్-3'. ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడే, సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాంతో అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.
 
పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఇటీవలే మళ్లీ షూటింగును మొదలుపెట్టారు. అయితే షూటింగు విషయంలో జాప్యం జరిగిన కారణంగా ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లకు రాకపోవచ్చుననే ఒక ప్రచారం జరుగుతోంది. 
 
కానీ, ఈ ప్రచారానికి హీరో వెంకటేశ్ తెరదించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన 'నారప్ప' సినిమా సక్సెస్‌మీట్‌లో వెంకటేశ్ మాట్లాడారు. 'నారప్ప' థియేటర్లలో రానందుకు అభిమానులు బాధపడొద్దనీ, 'ఎఫ్ 3' సినిమా సంక్రాంతికి థియేటర్లలోనే వస్తుందని అన్నారు. 
 
అప్పుడు అందరం కలిసి సందడి చేద్దాం అని చెప్పారు. దాంతో ఆయన ఈ సినిమా సంక్రాంతికి రావడం ఖాయమేననే విషయాన్ని స్పష్టం చేసినట్టు అయింది. అంటే సంక్రాంతి రేసులో ఎఫ్-3 ఉన్నట్టు తేలింది.