ప్రియా వారియర్ పక్కాగా సెట్ అయ్యింది, ఇష్క్ ట్రైలర్ ఎలా వుందంటే...?
ఇష్క్ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం రన్-టైమ్ కేవలం 1 గంట 55 నిమిషాలు. మలయాళ ఒరిజినల్ నుండి 20 నిమిషాల వ్యవధిలో ఉండే కొన్ని సన్నివేశాలను ఆకట్టుకునేట్లు తీసారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా అదరగొట్టడం ఖాయం అనిపిస్తుంది. జోంబీ రెడ్డితో తేజా సజ్జా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి దిల్ రాజు ఇలా అన్నారు.
`నా బిగినింగ్ డేస్ లో డిస్ట్రిబ్యూటర్‌గా నేను నిలబడడానికి సూపర్ గుడ్ ఫిలింస్ ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్, పారస్ జైన్ గారు ప్రోత్సహించిన విధానం మర్చిపోలేను. నేను డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ అయిన తర్వాత ఆర్.బి. చౌధరి గారు తమిళంనుండి చాలా సినిమాలు చేసేవారు. వారికి 90% సక్సెస్ రేట్ ఉండేది కాబట్టి వారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు. అలాంటి బేనర్‌లో వస్తున్న సినిమాకు నేను గెస్ట్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని` దిల్ రాజు అన్నారు.
తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం `ఇష్క్`. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దిల్‌రాజు మాట్లాడుతూ, గతేడాది నుండి కరోనా ప్రభావం అన్నిఇండస్ట్రీలమీద పడింది. ఫిలిం ఇండస్ట్రీమీద ఇంకా ఎక్కువ పడింది. మూడు నెలల తర్వాత ఈ నెల 30న విడుదలయ్యే రెండు సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ పాండమిక్‌ని గుర్తుపెట్టుకుని ప్రేక్షకులు కూడా తప్పకుండా మాస్కులు వేసుకునే సినిమా చూడాలని కోరుకుంటున్నాను. రామానాయుడుగారు, ఆర్ బి చౌధరిగారు ఇలా ఎవరెవరు కథల మీద మంచి గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్స్ అని స్టడీ చేసే నా ప్రతి సినిమాకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. అలాంటి సూపర్ గుడ్ ఫిలింస్‌లో వస్తోన్న ఇష్క్ సినిమా ఈ నెల 30న విడుదలవుతుంది. దర్శకుడు నాగరాజు నాతో శతమానం భవతి, ఎంసిఎ సినిమాలకు వర్క్ చేశారు. మంచి సినిమా కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను`` అన్నారు.
వాకాడ అప్పారావు మాట్లాడుతూ, చిన్న సంఘటన ఆధారం చేసుకుని తీసిన సబ్జెక్ట్ ఇది. ఇలాంటి సబ్జెక్ట్స్‌తో సినిమా తీయడానికి చాలా గట్స్ కావాలి. హీరోహీరోయిన్లు చక్కగా నటించారు.టెక్నీషియన్స్ మంచి సపోర్ట్ అందించారుని` అన్నారు.
దర్శకుడు ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ, నేను స్టేజ్‌మీద ఉండడానికి చేయూతనిచ్చింది దిల్‌రాజుగారే. కరోనా తర్వాత థియేటర్స్ ఓపెన్ చేయడం అందులో ఒక తెలుగు సినిమా విడుదలవుతుండడం చాలా సంతోషం. మనం అందరం తెలుగు సినిమాలని ఆదరించి మళ్లీ తెలుగుసినిమాకి పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇష్క్ ఒక కొత్త కథ. సినిమా చూసిన వాళ్లు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు`` అన్నారు.
ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ, తెలుగులో నా సెకండ్ ప్రాజెక్ట్. కరోనా తర్వాత నన్ను నేను మరోసారి బిగ్‌స్క్రీన్ మీద చూసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థియేటర్స్‌లో మా ఇష్క్ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో తేజ సజ్జ మాట్లాడుతూ, రెగ్యులర్ సినిమా కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెంట్ తో వస్తోంది. ఎడ్జ్ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సబ్జెక్ట్. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ వరకు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ ఇంతవరకూ రాలేదనుకుంటున్నాను. సాగర్ మహతి మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా నచ్చితే నలుగురికి చెప్పండి ఇలాంటి కొత్తరకం సినిమాలను ఎంకరేజ్ చేసిన వాళ్లుఅవుతారు. సినిమా రెడీ అయ్యాక కూడా థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దాం అని ఇన్ని రోజులు హోల్డ్ చేసిన మా నిర్మాతలకి థ్యాంక్స్. నా ఫస్ట్ సినిమాకి దిల్‌రాజుగారే మాట్లాడి నాకు అవకాశం ఇప్పించారు. ఇప్పుడు థియేటర్స్‌ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. మంచి సినిమాలకు దిల్‌రాజుగారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది`` అన్నారు.