నాని ఆవిష్కరించిన `అద్భుతం` లుక్ కి స్పందన
Sivani-Teja
అద్భుతం అనే టైటిల్ కి తగ్గట్లుగానే ఈ ఫస్ట్ లుక్ ని వినూత్నంగా సిద్ధం చేశారు దర్శకుడు మల్లిక్ రామ్, అప్ అండ్ డౌన్ పద్ధతిలో ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విశేషాదరణ అందకుంటూ ట్రెండ్ అవుతుంది. ప్రశాంత్ వర్మ స్టోరీ, మల్లిక్ రామ్ డైరెక్షన్ స్కిల్స్, తేజ సజ్జ యాక్షన్, శివాని రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యూటీ వెరసి అద్భుతం చిత్రం ప్రేక్షకుల్ని అత్యద్భుతంగా ఆకట్టుకోవడం ఖాయం అని నిర్మాత చంద్రశేఖర్ థిమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చంద్రశేఖర్ తెలిపారు.
తర్వాతి కథనం
