1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ravi Teja Newlook came without a face

ఫేస్ క‌నిపించ‌కుండా ర‌వితేజ న్యూలుక్ వ‌చ్చేసింది

Ravi Teja Newlook
Raviteja look
రవితేజ 68వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్‌. ర‌వితేజ కుర్చీలో కూర్చున్న స్టిల్  వెనుక‌భాగం క‌నిపించేలా చూపించారు. ఆయ‌న ఎదురుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అని బోర్డు చూపించడంతో ఆ కార్యాల‌యం ప‌నిమీద అక్క‌డి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇంకేముంది. అక్క‌డ అవినీతి అక్ర‌మాల‌కు చెక్ పెట్ట‌డానికి వ‌చ్చిన‌ట్లుగా కనిపిస్తున్న ఈ చిత్ర‌క‌థ వ‌ర్త‌మాన సంఘ‌ట‌న‌ల‌తో రూపొందుతోంద‌ని తెలుస్తోంది.‘ఆర్టీ68’ షూటింగ్ నేడు ప్రారంభమైందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
 
కాగా, ఈ చిత్రంలో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నారు. నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు స్వరకర్త సామ్ సిఎస్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్.
About Writer
ముర‌ళీకృష్ణ‌
తర్వాతి కథనం
నాని ఆవిష్క‌రించిన `అద్భుతం` లుక్ కి స్పంద‌న‌