శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 జులై 2022 (18:07 IST)

హెల్మెట్... తృటిలో తప్పిన ప్రాణాపాయం-Video

Accident
హెల్మెట్. ద్విచక్రవాహనం నడిపేటపుడు తప్పనిసరిగా ధరించాల్సిన రక్షణ కవచం ఇది. ఐతే చాలామంది దాన్ని పట్టించుకోరు. కొంతమంది హెల్మెట్ వున్నా... దాన్ని తన వాహనం ఆయిల్ ట్యాంకు పైనో... లేదంటే వెనక సీటుకు బిగించి వెళుతుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను ఎలా రక్షిస్తుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

 
పై వీడియోలో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ద్విచక్రవాహనదారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే... అతడికి నూకలు అంతటితో చెల్లిపోయేవి. అందుకనే ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపకూడదు.