శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (12:54 IST)

హెల్మెట్ ధరించకపోతే.. వెయ్యి రూపాయల జరిమానా

ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడితే ఇక అంతే సంగతులు. ఏపీలో వాహనదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు సర్కారు ఝుళిపిస్తోంది. ఇకపై ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడానికి వీలుంటుంది.
 
కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా కట్టాల్సి ఉంటుంది. అర్హత లేని వారికి డ్రైవింగ్ చేసే అవకాశం ఇస్తే రూ.5వేలు ఫైన్ పడుతుంది. ఇలా ట్రాఫిక్ జరిమానాలను భారీగా ఏపీ ప్రభుత్వం పెంచేసింది. 
 
ఈ నిబంధనలపై గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ కొద్దిరోజులుగా భారీస్థాయిలో జరిమానాలను విధిస్తుండగా, వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసిన మేరకే తాము జరిమానాలను విధిస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.