శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (10:09 IST)

అక్కడ హాఫ్ హెల్మెట్ ధరించడానికి వీల్లేదు...

ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలంటూ ట్రాఫిక్ పోలీసులు పదేపదే చెబుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా అవగాహన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే, చాలా మంది హెల్మెట్లు ధరించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసుల పోడుపడలేక హాఫ్ హెల్మెట్ ధరిస్తారు. కానీ, ఇకపై హాఫ్ హెల్మెట్ ధరించడానికి వీల్లేదు. 
 
ఈ మేరకు బెంగుళూరు నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై 15 రోజుల పాటు నగర వ్యాప్తంగా అవగాహనా ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత హాఫ్ హెల్మెట్‌ వాడకాన్ని బ్యాన్ చేస్తారు. పూర్తి హెల్మెట్ ధరించాలన్న నిర్బంధం తీసుకొస్తారు. లేనిపక్షంలో భారీగా అపరాధం విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.