మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (16:45 IST)

బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

బెంగుళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొత్తం 5.3 కోట్ల విలువ చేసే 754 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
 
దుబాయ్ నుంచి వచ్చిన ఓ పార్శిల్‌లో డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ బృందం తనిఖీలు చేసింది. ఇందులో హెరాయిన్ ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. అయితే ఈ పార్శిల్‌లో అధికారులకు ఏమాత్రం అనుమాన రాకుండా ఉండేలా హెరాయిన్‌ను ఫైల్ ఫోల్డర్ మధ్య భాగంలోదాచి ప్యాకింగ్ చేసి బెంగళూరుకు పంపించారు. 
 
ఈ డ్రగ్స్ వ్యవహారంపై ముందుగా వచ్చిన సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు కార్గో వింగ్‌లోని పార్శిళ్ళను నిశితంగా తనిఖీ చేశారు. అలాగే, డ్రగ్స్‌తో పాటు.. పార్శిల్ తీసుకున్న వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.