గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (16:55 IST)

పలు దేశాల నుంచి బెంగుళూరుకు వచ్చిన 354 మందికి కరోనా పాజిటివ్

ఇపుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్న ఎట్ రిస్క్ దేశాల జాబితా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు నిశితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పలు దేశాల నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారికి ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
వీరిలో 354 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో 7100 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, బెంగుళూరుకు విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రిస్క్ జాబితాలో చేర్చిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా ఈ పరీక్షలు చేస్తున్నారు.