ఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్: స్థిరంగా బంగారం వెండి ధరలు
ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాత బంగారం ధర పెద్దగా పెరగడం లేదు. తగ్గడమో లేదు. బంగారం, వెండి ధరలు స్థిరంగా వున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో రెండు రోజులుగా బంగారం ధరలు మారలేదు.
నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 44,760గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,476 పలుకుతోంది.
హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో నగరాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రస్తుతం తులం బంగారం రూ.44,760పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,000 గా ఉంది. ముంబైలో రూ.46,820, న్యూఢిల్లీలో రూ.46,910, కోల్‌కతాలో రూ.47,100, బెంగళూరులో రూ.44,760, కేరళలో రూ.44,760గా ఉంది.