శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:04 IST)

భద్రాద్రి రాముడికి బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చిన ఏపీ మంత్రి!

భద్రాద్రిలో కొలువైవున్న సీతారామచంద్ర స్వాముల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని బంగారు కిరీటాన్ని కానుకగా బహుకరించారు. మొత్తం 13 లక్షల రూపాయల వ్యయంతో ఈ కిరీటాన్ని తయారు చేయించి అందజేశారు. తన కుటుంబ సభ్యులతో సమేతంగా స్వామి క్షేత్రానికి చేరుకున్న కొడాలి నాని..  ఆలయ అర్చకులకు బంగారు కిరీటాన్ని అందజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు అలాగే, తమ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తినివ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు.