సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:59 IST)

స్వర్ణ రథానికి బదులు సర్వ భూపాల వాహనంపై పద్మావతి అమ్మవారు

శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలు మంగ.  సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

    
వాహనసేవలో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి,  ఏఈవో ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, సూప‌రింటెండెంట్లు శేషగిరి,  మధుసుదన్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ క‌న్నాఇతర అధికారులు పాల్గొన్నారు.