గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 5 జనవరి 2021 (18:58 IST)

పద్మావతి అమ్మవారి భక్తులకు శుభవార్త, బ్రేక్ దర్సనం పునఃప్రారంభం

కరోనా కారణంగా ఆలయాల్లో సేవలు, ప్రత్యేక దర్సనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరుచానూరు లాంటి ప్రధాన ఆలయాల్లో ఇప్పటికీ సాధారణ దర్సనమే ఉంది. విఐపిలు 100 రూపాయలు ఇచ్చి దర్సనానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక ప్రతిరోజు ఉండే కుంకుమార్చనను కూడా పూర్తిగా నిలిపేశారు.
 
అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రేక్ దర్సనాలను పునఃప్రారంభించాలని టిటిడి భావిస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి బ్రేక్ దర్సనం పునఃప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్సకాల అనుసరించి జూన్ 8వ తేదీ నుంచి ఆలయంలో అమ్మవారికి దర్సనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
 
ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు విఐపి బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి అమలు చేయనుంది. ప్రోటోకాల్ విఐపిలకు నిర్ధేశించిన సమయంలో అమ్మవారి దర్సనం కల్పించేందుకు సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి ప్రారంభించనుంది.