గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:40 IST)

లాక్ డౌన్ తర్వాత రికార్డు స్థాయిలో శ్రీవారికి భారీ కానుకలు

డిసెంబర్ మాసంలో ఇప్పటికే ఐదు సార్లు శ్రీవారి హుండి ఆదాయం 3 కోట్లు దాటింది. లాక్ డౌన్ అనంతరం శనివారం రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు సంఖ్య 45వేలు దాటనుంది. 
 
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున భక్తులు భారీ సంఖ్య హాజరయ్యారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. 
 
ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం 4గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించింది.
 
కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో దర్శన టోకెన్లు వున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. అయితే రికార్డు స్థాయిలో శ్రీవారికి హుండి ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ తరువాత స్వామి వారికి అత్యధిక హుండి ఆదాయం సమర్పించారు భక్తులు. ఇవాళ హుండి ద్వారా శ్రీవారికీ 4.3 కోట్లు ఆదాయం వచ్చింది.