గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (21:08 IST)

చంద్రబాబు.. ఇది కూడా రాజకీయమేనా? టిటిడి ఛైర్మన్..?

టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి టిడిపి అధినేతపై మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతిదీ రాజకీయమా అంటూ ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశి దర్సనం ప్రారంభం కాకముందే విమర్సలు చేయడం సరైంది కాదన్నారు. టోకెన్లు ఇవ్వలేని భక్తులపై లాఠీఛార్జ్ చేశామని బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
 
టోకెన్లు లేకుండా తిరుపతికి రావద్దని స్థానికేతరులకు విజ్ఙప్తి చేశాం. అయినా సరే చాలామంది వచ్చేశారు. ముఖ్యంగా గోవిందమాల భక్తులు అలిపిరి ముందే కూర్చుని గోవిందనామస్మరణలు చేశారు. పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బంది సానుకూలంగా వారిని అక్కడి నుంచి పంపించేశారు.
 
అంతేగానీ ఏ ఒక్కభక్తుడిపైనా లాఠీఛార్జ్ చేయలేదు. చేయము కూడా. తిరుమల వ్యవహారంలోను చంద్రబాబు రాజకీయాలు చేయడం సరైంది కాదు. దీన్ని ఇప్పటికైనా మానుకోవాలన్నారు టిటిడి ఛైర్మన్.