వై.ఎస్. జగన్ తర్వాత అంత స్థాయి ఈయనకే...
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత స్థాయి వుందని ఎవరి అనుకుంటున్నారా! ఆయన తర్వాత కనిపించే మంచి వ్యక్తి వై.వి. సుబ్బారెడ్డిగారే. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదొక అదృష్టం. మంచి మనిషి కాబట్టే ఆ పోస్ట్ ఆయనకు దక్కింది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు నాగార్జునతో సినిమా తీసిన ఢమరుకం దర్శకుడు శ్రీనివాసరెడ్డి అన్నమాటలివి.
వై.ఎస్. ఫ్యామిలీ గురించి ఆయన చెబుతూ, ఎమోషనల్‌కు లోనయ్యారు. కాసేపు మాటలురాలేదు. ఇందుకు కారణలేకపోలేదు. ఇటీవల కరోనా చాలామందిని కబళించింది. దానికి శ్రీనివాస రెడ్డి కూడా బాధితుడే. చావును దగ్గరగా చూశాడు. మే5వ తేదీన ఆయనకు కరోనా సోకి ఆసుప్రతిలో వున్నారు. డాక్టర్లు పరీక్షించి కష్టమని చెప్పేశారు. కొద్దిరోజుల ట్రీట్‌మెంట్ తర్వాత చెబుతామన్నారు.
ఇక ఈ విషయం పేషెంట్‌కే చెబితే ఎలా.. లోపల ఎంత బాధ. గందరగోళం.. నా కుటుంబం ఏమై పోతుందో అనే బెంగ... చాలా మనోవేధనకు గురయ్యారు. ఆసమయంలో శ్రీనివాస రెడ్డి విషయం తెలుసుకున్న వై.వి. సుబ్బారెడ్డి. యశోధ ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి మావాడు. ఆతనికి సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వండి అంటూ చెప్పిన మాట శ్రీనివాస రెడ్డికి శ్రీరామరక్షగా మారింది. అంతే అప్పటినుంచి యశోధా యాజమాన్యం శ్రీనివాసరెడ్డికి వున్న కరోనా తగ్గించేందుకు ప్రయత్నించారు.
ఆఖరుకు కోలుకుని ఇంటికి రాగలిగారు. ఈ కృతజ్ఞతను ఆయన తెలుపుతూ, నాకు సుబ్బారెడ్డి పునర్జన్మ ఇచ్చారు. నాకు ఆయన దేవుడు.. అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆదివారం జరిగిన రాధాకృష్ణ ఆడియో ఫంక్షన్‌లో ఈ సంఘటన జరిగింది. అనంతరం ఆయన కొనసాగిస్తూ, ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి ఎవరికుంది అనుకుంటే అంత మంచి మనిషి సుబ్బారెడ్డికే. నాకు వై.ఎస్. ఫ్యామిలీతో ఎనలేని అనుబంధం వుంది. రాజశేఖర్ రెడ్డి తర్వాత అంత మంచి మనిషి వై.వి. సుబ్బారెడ్డి.
నాకు రాజశేఖర్‌రెడ్డితో అత్యంత అనుబంధం వుంది. ఏదైనా పట్టకుని వెళితే. తింటూ, చెప్పరా అంటూ ఆప్యాయంగా గంటల తరబడి మాట్లాడేవారు. ఈరోజు ఆ పెద్దాయన్ను కోల్పోయాం.. ఇప్పుడు వైవిని ఆ స్థాయిలో చూసుకుంటున్నాం. నేనే కాదు, ప్రతి కార్యకర్త మాట్లాడుతకునేది. ఇదే అంటూ.. వ్యాఖ్యానించారు. అనంతరం సుబ్బారెడ్డి స్పందిస్తూ... శ్రీనివాస రెడ్డిని అప్పటినుంచి చూడలేదు. అందుకే ఆయన్ను చూడాలనే ఈ ఫంక్షన్‌కు వచ్చానని తెలిపారు.