గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (16:28 IST)

తిరుమల శ్రీవారి భక్తుల దాహార్తిని తీరుస్తా, ఏం భయపడకండి, కేంద్రమంత్రి హామీ

తిరుమలలో నీటి ఎద్దడి కనిపిస్తోంది. నీటి ప్రాజెక్టులు ఉన్నా సరిపడా నీరు మాత్రం లేదు. అయితే ఈరోజు తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ టిటిడికి హామీ ఇచ్చారు. తిరుమలలో శ్రీవారి భక్తుల దాహార్తిని తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. 
 
భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం తిరుమల. రోజుకు వేల సంఖ్యలో శ్రీవారి దర్సనార్థం భక్తులు తిరుమల చేరుకుంటూ ఉంటారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ నీటి సమస్య పెరుగుతుంది. అది నాకు బాగా తెలుసు. 
 
నీటి ఎద్దడిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కళ్యాణి డ్యాం నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న బాలాజీ రిజర్వాయర్‌కు సహకరారం అందించాలని టిటిడి ప్రతిపాదించింది. కేంద్రం ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వారి అభ్యర్థనను పంపాలని కోరాం. 
 
ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ తాగునీటిని ఇవ్వాలని ప్రధానమంత్రి సంకల్పించారు. అదే స్కీమ్‌లో తిరుమలలో నెలకొన్న నీటి సమస్యను చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.