శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 డిశెంబరు 2021 (22:03 IST)

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్, కేరళలో కళ్లెం లేని కరోనావైరస్

ముంబైలో కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ ఇద్దరికి తేలింది. దీనితో Omicron వేరియంట్ కేసుల సంఖ్య 23కి పెరిగింది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు ఇటీవలి విదేశాల నుంచి తిరిగి వచ్చిన 295 మందిలో కనీసం 109 మంది జాడ లేకుండా పోయారు. వీరి కోసం వెతుకుతున్నారు.

 
కేరళలో ఆగని కరోనా, ఏపీ తెలంగాణాల్లో పెరుగుతున్న కేసులు
కేరళలో మంగళవారం 4,656 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 మంది మృత్యవాత పడ్డారు. ఏపీలో 122 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరితో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 2030గా వుంది. మరోవైపు తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 203 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఇక్కడ 3852 యాక్టివ్ కేసులున్నాయి.