1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Indian Medical Association warn on Omicron Third Wave

ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే థర్డ్ వేవ్... : ఐఎంఏ

Indian Medical Association
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయని పక్షంలో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. 
 
కరోనా రెండో దశలో ఏర్పడిన ప్రళయాన్ని కళ్ళారా చవిచూశామని, ఇపుడు మరింత అప్రమత్తంగా లేకపోతే మాత్రం థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సాధారణ సాధారణ జనజీవన పిరిస్థితులు నెలకొనివున్నాయని గుర్తు చేసిన ఐఎంసీ.. ఇపుడు దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పారు. 
 
అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ వైరస్‌ వ్యాప్తిని సులభంగా కట్టడి చేయొచ్చని తెలిపింది. ప్రధానంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ విషయంలో ఏ విధంగా చిత్తశుద్ధితో పని చేశారో అదేవిధంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ దృష్టిసారించాలని కోరారు. లేకనిపక్షంలో ఒమిక్రాన్ ద్వార్ థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించారు.
తర్వాతి కథనం
సౌతాఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్ : పెరుగుతున్న ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు