ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (15:04 IST)

బ్రహ్మంగారి మఠంలో శ్రీ జ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం

బ్రహ్మంగారి మఠంలో శ్రీ జ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవాలలో ముఖ్య ఆతిధిగా ఎమ్మెల్సీ రమేష్, సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పాల్గొన్నారు. కరోనా సమయంలో సమాజంలో ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి వారికి జాతీయ స్థాయి పురస్కారం అందించారు. 

 
త‌న తండ్రి పేరున, ఆర్ వి ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటాన‌ని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సమాజానికి కొద్దోగొప్పో సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తాను కూడా తన తండ్రి స్వర్గీయ వెంకట సుబ్బయ్య పేరు మీద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందిస్తున్నాన‌ని చెప్పారు. దీనితోపాటు పుట్టిన, మరణించిన వారికి 5116 నగదు సహకారం, ఇంటింటి నెలసరి రేషన్ తో పాటు నిత్యావసర సరుకులు తన వార్డులోని ప్రజలకు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేశామ‌న్నారు. 
 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు వీరిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి తమ వంతు సాయంగా సేవ చేయాలన్నారు. జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి ట్రస్ట్ చైర్మన్ యనమల శ్రీనివాస్ యాదవ్,  టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు చిప్ప గిరి ప్రసాద్, డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.