గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (11:27 IST)

వరల్డ్ స్టూడెంట్స్ డే 2021 : కలాం దేశ ప్రజలకు స్ఫూర్తి : ప్రధాని మోడీ

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లాం 90వ జ‌యంతి వేడుక‌ల సందర్భంగా ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
'అబ్దుల్ క‌లాం దేశం కోసం త‌న జీవితాన్ని అంకితం చేశార‌ంటూ గుర్తుచేశారు. దేశాన్ని స‌మ‌ర్థ‌వంతంగా మార్చేందుకు క‌లాం కృషి చేశార‌ని కొనియాడారు. దేశ ప్ర‌జ‌ల‌కు అబ్దుల్ క‌లాం స్ఫూర్తిగా నిలుస్తారు' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల డే (వరల్డ్ స్టూడెంట్స్ డే)గా నిర్వహిస్తున్నారు. ఇది గత 2010 నుంచి పాటిస్తున్నారు. ఒక శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, లెక్చరర్‌గా రచయితగా, మంచి వక్తగా, ఒక దేశాధినేతగా ఇలా అనే విధాలుగా రాణించారు. 
 
ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పని చేశారు. గత 2002 నుంచి 2007 వరకు ఈయన రాష్ట్రపతిగా ఉండి, పీపుల్స్ ప్రెసిడెంట్‌గా ప్రశంసలు అందుకున్నారు. అందుకే, ఐక్యరాజ్యసమితి కూడా కలాం పుట్టిన రోజును వరల్డ్ స్టూడెంట్స్ డే గా అధికారికంగా ప్రకటించింది.