గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (15:57 IST)

భారత్‌లో 23కి చేరిన ఒమిక్రాన్ కేసులు

భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు 23కి చేరాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదయ్యాయి. గత  24 గంటల్లో  10,79,384 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఇదే సమయంలో 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 220 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఒక్క కేరళలోనే 168 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో వైరస్ క్రియాశీల రేటు 0.27 శాతానికి తగ్గగా... రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది.