ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ పీక్ స్టేజీలో వుంటుంది.. మనీంద్ర అగర్వాల్
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వదిలేలా లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ వేరియంట్లతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రమాదకర డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్ రూపంలో మరో భయంకర కొత్త వేరియంట్ వచ్చింది.
ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ భారత దేశంలో ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. దేశంలో రోజుకు 1 లేదా 1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఫిబ్రవరి నాటికి దేశంలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ చేరుకుంటుందనే అంచనాలో వున్నామని తెలిపారు.
ఇకపోతే.. మహరాష్ట్రలో రెండు, రాజస్థాన్‌లో ఒక కేసు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు దేశంలో నమోదయ్యాయి.