మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (17:05 IST)

ఇండో-పాక్ సరిహద్దు వద్ద మగబిడ్డకు జన్మనిచ్చిన పాకిస్థానీ మహిళ.. "బోర్డర్"

భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థానీ మహిళ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో జన్మించిన కారణంగా.. బోర్డర్ అనే పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. నింబు బాయి అనే మహిళ అట్టారి సరిహద్దు వద్ద మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
భర్త బలం రామ్‌తో కలిసి సరిహద్దు వద్ద గూడారంలో వుంటున్న ఆమెకు పురిటినొప్పులు రావడంతో.. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు బోర్డర్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. భార్య ప్రసవం కోసం పంజాబ్ పొరుగు ప్రాంతాలలోని మహిళల నుండి, ఇతర గ్రామస్థుల నుండి సహాయం పొందాడు. అంతేగాకుండా సరిహద్దుల వద్ద ఆ బిడ్డ పుట్టడంతో గూడారంలో వుంటున్న ప్రజలు పండుగ చేసుకున్నారు.  
 
ఇకపోతే.. 97 మంది పాకిస్తాన్ పౌరులు తీర్థయాత్ర, భారతదేశంలో నివసిస్తున్న తమ బంధువులను కలవడానికి భారతదేశాన్ని సందర్శించారు. అయితే తమ దేశంలోకి ప్రవేశించడానికి అవసరమైన పత్రాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్‌కు తిరిగి చేరుకోలేకపోయారు. 
 
ఇలా అట్టారి సరిహద్దు దాటలేని ప్రజలందరూ అంతర్జాతీయ చెక్ పోస్ట్ సమీపంలోని గుడారంలో ఉంటున్నారు. వారికి అక్కడి స్థానికులు ఆహారం, వైద్య సదుపాయాలను అందిస్తారు. ఈ గూడారంలో వుంటున్న మహిళే మగబిడ్డను ప్రసవించింది.