1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (11:05 IST)

ఫిషింగ్ బోట్‌లో రూ.400 కోట్ల హెరాయిన్ - గుజరాత్‌లో స్వాధీనం

ఇటీవలి కాలంలో గుజరాత్ రాష్ట్రంలో భారీగా గంజాయి వంటి మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. గుజరాత్ సముద్రతీర ప్రాంతంలో ఇందుకు అడ్డాగా మారుతోంది. హెరాయిన్‌తో పాటు గంజాయిని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.400 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ సముద్రతీర తీరంలో భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భారత జలాల్లో పాకిస్థాన్‌కు చెందిన షిషింగ్ బోట్‌ను అధికారులు గుర్తించి దాన్ని తనిఖీ చేశారు. 
 
అందులో రూ.400 కోట్ల విలువ చేసే 77 కేజీల హెరాయిన్‌ను అధికారులు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, హెరాయిన్‌ను తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.