శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 జులై 2022 (23:14 IST)

ఉడాన్‌తో భాగస్వామ్యం చేసుకున్న హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన పీట్రాన్‌

pTron
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఎలక్ట్రానిక్స్ తయారీదారు పీట్రాన్‌, భారతదేశంలో అతిపెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ ఈ-కామర్స్‌ వేదిక ఉడాన్‌తో  భాగస్వామ్యం చేసుకుని 2.5 లక్షల యూనిట్లను ఉడాన్‌పై విక్రయించింది.


2021-2022 ఆర్ధిక సంవత్సరంలో 10 కోట్ల రూపాయల విలువ కలిగిన పీట్రాన్‌ ఉత్పత్తులను ఈ వేదిక ద్వారా విక్రయించారు. ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో (టీడబ్ల్యుఎస్‌) మరియు హెడ్‌ఫోన్‌ శ్రేణి ఉత్పత్తులు ఈ వ్యాపారంలో 72%కు పైగా తోడ్పాటునందించాయి.

 
పీట్రాన్‌ సీఈవో- ఫౌండర్‌ అమీన్‌ ఖ్వాజా మాట్లాడుతూ, ‘‘సరఫరా చైన్‌ సామర్ధ్యంలతో పాటుగా ఉడాన్‌ యొక్క మార్కెటింగ్‌ మద్దతు, రియల్‌టైమ్‌ ఎనలిటిక్స్‌ ఇప్పుడు నూతన మార్కెట్‌లకు విస్తరించేందుకు, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, ఉత్పత్తి పరీక్షలను విభిన్న మార్కెట్‌లలో చేసేందుకు అనుమతిస్తుంది. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వ్యాప్తంగా డిజిటల్‌ స్వీకరణ పెరగడం చేత ఉడాన్‌తో మరింతగా వృద్ధి చెందగలమని ఆశిస్తున్నాము. ఉడాన్‌తో మా బ్రాండ్‌, ఉత్పత్తి జాబితాను విస్తరించాలని కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో ఉడాన్‌పై 60 కోట్ల రూపాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాము’’ అని అన్నారు.

 
ఉడాన్‌, హెడ్‌ ఎలక్ట్రానిక్స్ విభాగం హిరేంద్రకుమార్‌ రాథోడ్‌ మాట్లాడుతూ, ‘‘ఉడాన్‌పై పీట్రాన్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మార్కెట్‌లో అత్యున్నత నాణ్యత కలిగిన ఈ బ్రాండ్‌కు అత్యధిక డిమాండ్‌ ఉంది. చిన్న పట్టణాలలో సైతం ఉన్న మా డిస్ట్రిబ్యూషన్‌ బలంతో పాటుగా జాతీయ మార్కెట్‌ ప్రాప్యత, అందుబాటు ధరలు వంటివి ఉడాన్‌ను ప్రాధాన్యతా భాగస్వామి బ్రాండ్‌గా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లు ఎంచుకుంటున్నాయి’’ అని అన్నారు.