ఫారెక్స్ మార్కెట్‌లో #Rupee @80 - ఆల్‌టైమ్ కనిష్టం
అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ నానాటికీ దిగజారిపోతోంది. ముఖ్యంగా అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మరింతగా క్షీణించిపోతోంది. ఫలితంగా సోమవారం డాలర్‌పై రూపాయి మారకం విలువ ఆల్‌టైం కనిష్ట స్థాయికి పతనమైంది. చరిత్రలో తొలిసారి 80కి చేరింది.
సోమవారం మార్కెట్ ముగింపు దశలో 15 పైసలు కోలుకుని 79.97 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం నిధుల ఉపసంహరణకు దిగడంతో రూపాయి విలువ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.
నిజానికి సోమవారం ట్రేడింగ్ ప్రారంభంకాగానే రూ.79.76 వద్ద మొదలై తర్వాత రూపాయి విలువ ఆ తర్వాత మరింతగా బలహీనపడింది. డాలర్‌పై ఒకానొక దశలో 80 పైసలకు పడిపోయింది. ఇది కొద్ది సేపు అలాగే కొనసాగింది.
చివరకు ముగింపు దశలో 15 పైసల లబ్ధితో 79.76 వద్ద స్థిరపడింది. శుక్రవారం 80 రూపాయల సమీపానికి పడిపోయిన రూపాయి తిరిగి 17 పైసలు కోలుకుని 79.98 వద్ద నిలబడింది.