1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 12 జులై 2022 (20:18 IST)

గ్యాంగ్ రేప్ చేసి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టారు

ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఐదుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేసారు. అనంతరం పంచాయతీ పెట్టి బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టి విషయాన్ని బయటకు రానీయవద్దంటూ హెచ్చరించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జూలై 9న జరిగింది. జరిగిన దారుణాన్ని బయటకు తెలియకుండా వుండేందుకు బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జష్పూర్ ఏఎస్పీ ప్రతిభా పాండే తెలిపారు.

 
విషయం బయటకు రావడంతో పోలీసులు కుటుంబీకుల వద్దకు వెళ్లారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. నిందితులందరినీ కస్టడీలో తీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని ఆమె తెలిపారు.