బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (19:32 IST)

యువతిపై అత్యాచారం.. కాపాడిన హిజ్రాలు.. ఎక్కడ?

woman victim
హిజ్రాల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అలాంటి వారిని సమాజం పక్కనబెడుతోంది. అయినా వారు పలు రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఓ యువతిని కామాంధుల నుంచి ఇద్దరు హిజ్రాలు కాపాడారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేయబోతున్న యువకుడిని అడ్డగించి, ఆ యువతిని కాపాడారు.
 
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని కేఆర్ పురంలోని వివేక్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కోరమంగళం వద్ద ఉన్న ఈజిపురలో మిజోరాం కు చెందిన ఒక యువతి నర్సింగ్ కోర్సు చేస్తూ నివసిస్తోంది.
 
అదే ప్రాంతంలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన మసురుల్ షేక్ అనే యువకుడు యువతిపై కన్నేశాడు. ఆమె ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కి కనిపించకుండా పోయేవాడు. తలుపు తీసుకుని చూస్తే ఎవరూ కనపడకపోయే సరికి ఆ యువతి మళ్లీ తలుపు వేసుకుని లోపలకు వెళ్లిపోయేది.
 
ఈనెల 2వ తేదీ తెల్లవారుజాము కూడా అదే మాదిరిగా కాలింగ్ బెల్ నొక్కాడు. ఆమె డోర్ తీయగానే ఆమెను నెట్టుకుంటూ లోపలకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. బాధితురాలి కేకలు విని అక్కడకు దగ్గరలోనే ఉన్న ఇద్దరు హిజ్రాలు వచ్చి యువతిని రక్షించి… ఆ యువకుడిని పట్టుకున్నారు. స్ధానికులు వచ్చి యువకుడికి దేహశుధ్ది చేసి పోలీసులకు అప్పగించారు.