సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (09:34 IST)

ఫేస్‌బుక్ ప్రేమ.. యూపీ అబ్బాయి, పాకిస్థాన్ అమ్మాయి..

marriage
ఫేస్‌బుక్ ప్రేమతో ఆ జంట ఒక్కటైంది. యూపీ అబ్బాయి.. పాకిస్థాన్ అమ్మాయికి పెళ్లి కుదిరింది. దాయాది దేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రేమ చిగురించింది.

ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే, యూపీకి చెందిన ఫరుక్కాబాద్‌కు చెందిన జర్దోజీ ఆర్టిస్ట్ మహ్మద్ జమల్‌కు (23) ఎరాం అనే అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. 
 
ఇద్దరు మాట్లాడుకోవడం తర్వాత ఆమెది పాకిస్థాన్ తెలిసింది. అయినా సరే వారిద్దరూ ఏ మాత్రం వారి ప్రేమను చంపుకోలేదు. జర్దోజీ ప్రపోజ్ చేయగానే.. ఎరాం ఒప్పుకుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయానికి వచ్చారు.
 
దానికోసం జర్దోజీ ఆర్టిస్ట్ భారత దేశం నుంచి పాకిస్థాన్‌నుకు వెళ్లాడు. జూన్ 17వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ఆ జంట ఇండియాకు రానున్నారు. ఆ జంటకు స్వాగతం చెప్పేందుకు జర్దోజీ తండ్రి అలీముద్దిన్ అన్ని ఏర్పాట్లు చేశారు.