శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (18:20 IST)

శోభితతో నాగచైతన్య డేటింగ్? ఇకనైనా ఎదగండి అబ్బాయిలు అంటూ సమంత వార్నింగ్...

Samantha
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
రెండుమూడు రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య మరో నటి శోభిత ధూళిపాళతో డేటింగులో వున్నాడంటూ గాలివార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు సమంత తన స్టైలిస్ట్ ప్రీతంతో రిలేషన్లో వుందంటూ గాసిప్స్ పోతూనే వున్నారు. ఇంకా సమంత విపరీతంగా గ్లామర్ డోస్ పెంచేసిందని కూడా చెవులు కొరుక్కుంటున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... నాగచైతన్య- శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్లను పుట్టించిందే సమంత పీఆర్ టీం అంటూ చైతు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే ఇదంతా చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

 
ఈ కామెంట్స్ చూసిన సమంత చిర్రెత్తిపోయి అక్కినేని అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది. అమ్మాయిలపై పుకార్లు వస్తే అది నిజమేనంటారు, కానీ అబ్బాయిలపై వస్తే మాత్రం దానికి కారణం అమ్మాయేననీ, అదంతా ఆమే చేసిందని అంటారా... ఇకనైనా ఎదగండి అబ్బాయిలు... మీ పనిమీద, మీ కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.