నటితో నాగ చైతన్య డేటింగ్.. బాంబు పేల్చిన సమంత?  
                                       
                  
                  				  ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న "మేజర్" చిత్రంలో కీలక పాత్రను పోషించిన నటి శోభితతో తన మాజీ భర్త నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నారని హీరోయిన్ సమంత బాంబు పేల్చినట్టు వార్తలు వస్తున్నాయి. సమంత చేసిన వ్యాఖ్యలు ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 
				  											
																													
									  
	 
	"మేజర్" సినిమా ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో కూడా నాగ చైతన్య ఇంటిలోనే శోభిత ఉన్నారని ఆమె ఆరోపించారు. పైగా, వారిద్దరూ ఒకే కారులో ప్రయాణం చేశారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పైగా, శోభిత ధూళిపాళ్ళ తన పుట్టినరోజు వేడుకలను కూడా హైదరాబాద్ నగరంలోనే చైతూతో కలిసి జరుపుకుంది.
				  
	 
	మొత్తానికి సమంతతో విడిపోయిన నాగ చైతన్య ఇపుడు.. నటి శోభితతో సన్నిహింతంగా ఉన్నట్టు వార్తలు రావడం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, సమంత చేసిన ఆరోపణతో పాటు.. తమ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల స్పందించాల్సివుంది.