1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

kamal haasan
అగ్రనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఆయన తమిళనాడు రాష్ట్రం నుంచి డీఎంకే కూటమి తరపున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. దీంతో ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా ఆయన తమిళంలో ప్రమాణం చేశారు. 
 
కాగా, జూన్ నెలలో డీఎంకే కూటమి మద్దతులో కమల్ హాసన్ రాజ్యసభకు ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఆయనతో పాటు డీఎంకే నుంచి పి.విల్సన్, సల్మా, ఎస్ఆర్ శివలింగంలు కూడా ఎంపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు కూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఇక 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. 2021లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటించి, కోయంబత్తూరు దక్షిణం స్థానం నుంచి పోటీ చేసి తృటిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో డీఎకే కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
 
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలుపుకుని 134 మంది ఎమ్మెల్యేలు డీఎంకే కూటమికి ఉన్నాయి. దీంతో ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో మొత్తం నాలుగు ఎంపీ సీట్లను డీఎంకే కూటమి దక్కించుకుంది. 2024లో కుదిరిన ఒప్పందం మేరకు కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటును కేటాయించారు.