శుక్రవారం, 27 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జూన్ 2025 (10:08 IST)

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

Bigg Boss Season 9
Bigg Boss Season 9
బిగ్ బాస్ సీజన్ 9 గురించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే.. అంటూ ఓ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోను బట్టి ఈసారి కూడా కింగ్ నాగార్జునే బిగ్ బాస్ 9 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. బిగ్ బాస్ ఏడు సీజన్ల వరకు బాగా నడిచినా.. గత సీజన్ అంటే 8వ సీజన్‌కు పెద్దగా ఆదరణ లభించలేదనే టాక్ వినిపించింది. 
 
అందువల్ల తరువాత రాబోయే సీజన్ 9కు అలాంటి పొరపాట్లు జరగకూడదనే పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సారి మరింత క్రేజీ, టాక్ ఆఫ్ ది టౌన్‌‌గా మారిన వారిని కంటెస్టెంట్లుగా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇంకా హోస్టును మారుస్తారనే టాక్ కూడా వచ్చింది. 
 
అయితే బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జుననే హోస్టుగా ఖరారు చేశారు. ఇంకా బిగ్ బాస్ 9 తెలుగు మరింత కాంట్రవర్సీ, డ్రామా, ఎంటర్‌ట్రైనర్‌గా వుండాలని ప్లాన్ చేసుకుంటున్నారు.