శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు.. ఊడిన ఉద్యోగం

teacher love propose
ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే విద్యార్థినిపై మనసు పారేసుకున్నాడు. పైగా, తరగతి గదిలోనే ఆ విద్యార్థిని ప్రపోజ్ చేశారు. మోకాళ్ళపై కూర్చొని పువ్వుతో ఐ లవ్ యూ అని చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే.. ఆ ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊడింది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని ధామాజీ పట్టణంలో జరిగింది. 
 
ఈ పట్టణానికి చెందిన మనోజ్ కుంబంగం అనే వ్యక్తి స్థానికంగా ఉండే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోచన ట్రైనింగ్ సెంటరులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినిపై మనసు పారేసుకున్నాడు. తన ప్రేమను వెల్లడించేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్న మనోజ్‌ ఒక మంచి రోజు చూసుకుని తరగతి గదిలోనే సినిమా పంథాలో తన లవ్‌ను ప్రపోజ్ చేశాడు. చేతిలో పువ్వు పట్టుకుని మోకాళ్ళపై కూర్చుని అమ్మాయి ఎదుట తన ప్రేమను బయటపెట్టాడు. ఈ దృశ్యాన్ని తరగతి గదిలోని మిగతా విద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
అయితే, మనోజ్ చేసిన ప్రతిపాదనకు అమ్మాయి నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో లేదో తెలియదుగానీ ఆయన ఉద్యోగం మాత్రం ఊడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే, విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.