మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (14:37 IST)

లేటుగా వచ్చిందని ఉపాధ్యాయురాలిపై ప్రిన్సిపల్ దాడి

Teacher
ఒక ప్రిన్సిపల్ చిన్న పాటి విషయానికే ఉపాధ్యాయురాలిపై దాడికి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ అమానుష ఘటన జరిగింది. లఖింపూర్ ఖేరీలోని మహేంగు ఖేరా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే.. పాఠశాలకు ఒక మహిళ టీచర్ ఆలస్యంగా వచ్చింది. దీంతో ప్రిన్సిపల్‌కి కోపం వచ్చింది. దీంతో అందరి ముందే రెచ్చిపోయాడు. 
 
టీచర్‌ను బూటు తీసుకుని ఇష్టమోచ్చినట్లు కొట్టాడు. దీంతో అక్కడే ఉన్న తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత.. ఉపాధ్యాయురాలు కూడా ప్రిన్సిపల్ ను కొట్టింది. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్.. అజిత్ వర్మను సస్పెండ్ చేస్తున్నట్లు.. జిల్లా విద్యాశాఖ అధికారి (బిఎస్‌ఎ) లక్ష్మీకాంత్ పాండే తెలిపారు. 
 
అయితే, దీనిపై ప్రిన్సిపల్ వాదన మరో విధంగా ఉంది. సదరు ఉపాధ్యాయురాలు రోజు కావాలనే ఆలస్యంగా వస్తుందని తెలిపాడు.