పెళ్లి బరాత్‌లో తుపాకీతో కాల్పులు.. మిస్ ఫైర్.. యువకుడి మృతి (video)
సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్లు ఒక వంతు. సంప్రదాయానికి ప్రస్తుతం ట్రెండింగ్, ఫ్యాషనై తోడయ్యే పెళ్లిళ్లు మరోవైపు. తాజాగా పెళ్లి వేడుక అనంతరం నిర్వహించిన బరాత్‌లో బంధుమిత్రులు అందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గడుపుతోన్న సమయంలో పెళ్లి కొడుకు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
అనంతరం ఆ తుపాకీని జేబులో పెట్టుకుంటోన్న సమయంలో అది మిస్‌ఫైర్ అయి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి ఓ కెమెరాలో రికార్డయ్యాయి.
సోన్‌భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్‌లో మనీశ్ మధేషియా అనే యువకుడి పెళ్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బరాత్ సమయంలో మనీశ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం ఓ బుల్లెట్ అతడి స్నేహితుడు, ఆర్మీ జవాను బాబులాల్ యాదవ్‌కు తగిలింది.
ఆ తుపాకీ కూడా బాబులాల్ యాదవ్‌దే. అతడిని ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.