ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 జులై 2022 (17:38 IST)

నాన్‌ ఐసీయు హాస్పిటల్‌ వార్డ్స్‌లో కనెక్టడ్‌ బెడ్స్‌ ద్వారా దేశంలో ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కోసం ఏటా రూ. 2150 కోట్లు ఆదా

covid hospital
దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల పరంగా ఉన్న అత్యంత కీలకమైన అంతరాలను వెల్లడించే క్రమంలో సాంకేతిక పరిష్కారాలపై ఓ స్వతంత్య్ర అధ్యయనం ‘అన్‌లాకింగ్‌ ద పొటెన్షియల్‌ ఆఫ్‌ కనెక్టడ్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌ ఇండియా’ (భారతదేశంలో కనెక్టడ్‌ హెల్త్‌కేర్‌ సామర్థ్యంను ఒడిసిపట్టడం)ను నేడు విడుదల చేశారు. అపోలో గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి ఈ నివేదికను సత్త్వా కన్సల్టింగ్‌ సీఈఓ కో-ఫౌండర్‌ శ్రీ శ్రీకృష్ణ శ్రీధర్‌ మూర్తి; డోజీ సీఈఓ, కో-ఫౌండర్‌ శ్రీ ముదిత్‌ దండ్వాటీతో కలిసి విడుదల చేశారు.

 
ఈ అధ్యయనం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డోజీ కనెక్టడ్‌ బెడ్స్‌ ద్వారా నాన్‌ ఐసీయు వార్డ్‌లలో ఉన్న రోగులను పర్యవేక్షించడం ద్వారా ఐసీయు బెడ్స్‌, డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది కొరతను అధిగమించవచ్చు. అదే సమయంలో ఇది అత్యున్నతంగా రోగికి భద్రతను అందిస్తూనే సంవత్సరానికి 2150 కోట్ల రూపాయలను ఆదా చేస్తుందని వెల్లడించింది.

 
ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు హాస్పిటల్‌ (ఐజీజీఎంసీ)లో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీగా సేవలనందిస్తోన్న డాక్టర్‌ వైశాలీ షెల్గోంకర్‌ మాట్లాడుతూ... భారీ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో రిమోట్‌ పేషంట్‌ మానిటరింగ్‌, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలైనటువంటి డోజీ లాంటివి అందుబాటులోకి తీసుకువస్తే సమయం, శ్రమ ఆదా కావడంతో పాటుగా తమ బాధ్యతలను నర్సింగ్‌ సిబ్బంది మరింత మెరుగ్గా నిర్వర్తించగలరన్నారు.

 
సత్త్వా కన్సల్టింగ్‌ సీఈఓ అండ్‌ కో-ఫౌండర్‌ శ్రీకృష్ణ శ్రీధర్‌ మూర్తి మాట్లాడుతూ ‘‘కోవిడ్‌ 19మహమ్మారి దేశంలో ఆరోగ్యసంరక్షణ మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను పెంచింది. అదే సమయంలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ ప్రభుత్వ-ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాల ద్వారా సాంకేతికత, ఆవిష్కరణల ఆవశ్యకత కూడా పెరిగింది. డోజీ నుంచి కనెక్టడ్‌ బెడ్స్‌ లాంటి ఆవిష్కరణలు ఈ కోవలోనివే. భారతదేశంలో ప్రజా ఆరోగ్య సవాళ్లను అధిగమించడంలో ఇది ఓ గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు.