1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 జులై 2022 (16:51 IST)

‘దిల్‌దార్‌ బనా దే’... మాజా బ్రాండ్ అంబాసిడర్లు అమితాభ్ బచ్చన్- పూజా హెగ్డే

Pooja-Amitab
ఆధునిక రీతి కథాగమనము మరియు సృజనాత్మకమైన భావజాలీకరణతో భారతీయ పండుగ సీజనులో ప్రవేశిస్తూ, కోకా-కోలా ఇండియా యొక్క అభిమాన స్వదేశీ మామిడిపళ్ళ పానీయము అయిన మాజా, ఒక కొత్త క్యాంపెయిన్ కి తెర లేపింది, సామాజిక సంబంధాలకు స్ఫూర్తిని కలిగిస్తూ ప్రియమైన వారిని సంఘటితం చేసి తీసుకురావాలనే కంపెనీ యొక్క లక్ష్యానికి అది కచ్చితమైన పోలిక కలిగి ఉంది. ఈ కొత్త ప్రకటనతో, మాజా తనకు తానుగా సంఘటితంగా ఉన్న క్షణాల్లో కుటుంబాలకు ఇష్టమైన పానీయంగా సుస్థిరపరచుకునే ధ్యేయముతో ఉంది. ఈ చిత్రం కోసం, బ్రాండు మరొక్కసారి తన బ్రాండ్ అంబాసిడర్లను సంఘటితంగా మీ ముందుకు తీసుకువచ్చింది - వారు, సుప్రసిద్ధ చలనచిత్ర నటుడు, ప్రముఖులు శ్రీ అమితాభ్ బచ్చన్, మరియు సుపరిచితమైన నటి మరియు మోడల్ పూజా హెగ్డే.
 
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 200 మిలియన్లకు పైగా నెలవారీ పానీయ ప్రియులతో, భారతీయ రైతుల సామాజిక-ఆర్థిక సాధికారతకు దోహదపడుతూనే దేశం యొక్క అత్యంత ప్రియమైన మామిడిపళ్ళ పానీయముగా కొనసాగాలనేది బ్రాండు యొక్క ఉద్దేశ్యముగా ఉంది. స్వదేశములో పుట్టి పెరిగిన మాజా స్థానికంగా, స్థానిక పదార్థాలను ఉపయోగించి  కోకా-కోలా ఇండియా యొక్క సుస్థిర వ్యవసాయ చొరవ అయిన – ‘ఫల వలయ ఆర్థికస్థితి’ కి అనుగుణంగా విశిష్టమైన రీతిలో తయారు చేయబడింది.
 
కొత్త క్యాంపెయిన్ యొక్క ఆవిష్కరణను ప్రకటిస్తూ, కోకా-కోలా ఇండియా మరియు సౌత్‌వెస్ట్ ఏషియా, న్యూట్రిషన్ కేటగరీ, డైరెక్టర్ మార్కెటింగ్ శ్రీ అజయ్ కొనాలే ఇలా అన్నారు, “ఈ సంవత్సరం తొలిరోజుల్లో, మేము 'దిల్‌దారీ’ చుట్టూ మాజా యొక్క కొత్త అంబ్రెల్లా క్యాంపెయిన్ విడుదల చేశాము, మాజాను వైవిధ్యమైన రీతిలో అంతులేని మామిడిపళ్ళ రుచి అనుభవంగా పునరుద్ఘాటించడంలో ఇది సహాయపడింది. ఒక ఫలముగా మామిడిపండు ఇండియాలో ఒక విశిష్టమైన మరియు వైవిధ్యమైన పాత్ర పోషిస్తోంది. మొత్తం రైతులందరూ మామిడిపళ్ళ మీద కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. ఒక అధీకృత మామిడిపండు అనుభవముగా, కుటుంబాలు కలిసికట్టుగా ముందుకు రావడం, మామిడిపళ్ళను ఇష్టపడే తరాలు అన్నీ కలిసి సంఘటితంగా ఉండే క్షణాలను మధురం చేసుకోవాలని మాజా నొక్కి చెబుతోంది.
 
కుటుంబ కలయికలు కూడా లావాదేవీపరమైనవిగా మారిన ఈ రోజుల్లో ఇది ప్రత్యేకించి ఇంతకు ముందుకంటే మరింత సముచితంగా ఉంది.  ఈ కొత్త దిల్‌దారీ పొజిషనింగ్ పరిచయం చేయడానికై మేము 2022 మొదట్లోనే  అమితాభ్ బచ్చన్ మరియు మోడల్ పూజా హెగ్డే తో సమన్వయం చేసుకున్నాము. మేము తెరతీయబోతున్న కుటుంబం మరియు పండుగ సంబరాల కొరకు మా బ్రాండు యొక్క విలువలను మూర్తీభవించుకున్న ఈ ఇద్దరు తారలతో మేము ముందుకు సాగుతాము.  కుటుంబ సంఘటితం యొక్క ఈ ఆలోచనను మా వినియోగదారులకు మాజా  సేవనం వల్ల కలిగే తృప్తి ద్వారా మేము జాతీయ మరియు ప్రాంతీయ టెలివిజన్ మరియు డిజిటల్ మాధ్యమాల వ్యాప్తంగా కూడా గణనీయంగా తెలియజేస్తాము”
 
మాజా యొక్క సిద్ధాంతం అయిన ‘దిల్‌దారీ’ ని సజీవంగా ముందుకు తీసుకురావడంలో మాతో శ్రీ అమితాభ్ బచ్చన్ మరియు కుమారి పూజా హెగ్డే యొక్క నిరంతర భాగస్వామ్యమును కలిగి ఉండడం పట్ల మేము ఎంతగానో సంతోషిస్తూ వారి పట్ల వినమ్రులమై ఉన్నాము.”  హృద్యమైన టీవీసి అమితాభ్ బచ్చన్ మరియు పూజా హెగ్డే తాత మరియు మనవరాలి జంటగా నటించే సన్నివేశాన్ని ప్రదర్శిస్తుంది, వారు ఒక గ్లాసు (లేదా రెండు) మాజా త్రాగుతూ అనిర్వచనీయమైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ తమాషాగా కుటుంబ గాధలను చెప్పుకుంటూ ఆనందించడాన్ని మనం చూడవచ్చు. మనుషులందరూ కలిసి వచ్చి, తమ గాధలను పంచుకొని మరియు విడదీయలేని బంధాలను కల్పించుకోవడానికై కుటుంబముతో గడిపే తమాషా క్షణాలు మరియు సంభాషణలు అక్కడ ఎలా వెలుగులు నింపుతాయో ప్రదర్శించడాన్ని ఈ చిత్రం ధ్యేయంగా చేసుకుంది.
 
భారతీయ నటీమణి మరియు కొత్త మాజా క్యాంపెయిన్ తార పూజా హెగ్డే, ఇలా అన్నారు, “మాజా నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొంది, మరియు ఈ సంవత్సరం బ్రాండు యొక్క ప్రయాణంలో నిరంతరమూ ఒక భాగంగా ఉండటం పట్ల నేను నిజంగా గౌరవించబడ్డాను.  ఈ సంవత్సరం మనం ఇండియాలో పండుగ సీజన్ సమీపించే కొద్దీ, మాజా యొక్క కొత్త క్యాంపెయిన్, కుటుంబాలు, స్నేహితులు మరియు ప్రియమైన వారి మధ్య కలిసి ఉన్నామనే ఒక ప్రత్యేకమైన భావనను రేకెత్తిస్తోంది.  ఈ అందమైన చిత్రం యొక్క ఒక భాగంగా ఉన్నందుకు, మరొక్కసారి నా గురుతుల్యులు శ్రీ బచ్చన్ గారితో పని చేసే అవకాశం వచ్చినందుకు నేను ఎంతగానో ఆనందించాను మరియు గౌరవించబడ్డాను” అన్నారు.  
 
 
ఈ క్యాంపెయిన్ చిత్రం మాజా యొక్క సృజనాత్మక భాగస్వామి ఓజిల్వీ (Ogilvy) చే భావజాలీకరణ చేయబడింది. క్యాంపెయిన్ వెనుక ఉన్న సృజనాత్మక గ్రాహ్యతపై వ్యాఖ్యానిస్తూ, ఓజిల్వీ ఇండియా, ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ శ్రీ సుకేష్ నాయక్ గారు ఇలా అన్నారు, “వడివడిగా అడుగులు పడుతున్న నేటి జీవితంలో, కుటుంబాలు పరస్పరమూ బంధం ఏర్పరచుకోవడానికై కొంత సమయం కలిసి గడపాలని కోరుకుంటారు.  మాజా తన నిజమైన మామిడిపళ్ళ మాధుర్యముతో, కుటుంబములోని ప్రతి ఒక్కరూ సమస్తమూ మరచిపోవడానికి మరియు మామిడిపళ్ళ రసానుభూతిని రుచి చూడడానికీ కచ్చితమైన ఉత్తేజకారకం అవుతుంది” అన్నారు.
 
ఈ చిత్రం, ఒక తాత మరియు మనవరాలి మధ్య హృదయంగమమైన కథకు జీవం పోసిన షూజిత్ సర్కార్ గారిచే దర్శకత్వం వహించబడింది.  ఇంకా అతను ఇలా అన్నారు, “ఏది ఏమైనా మనందరమూ చాలా బిజీగా ఉంటున్నాము మరియు మనం మన ప్రీతిపాత్రమైన వారితో గడపాల్సిన ఈ కీలకమైన ఆనంద క్షణాలను కోల్పోతున్నాము.  నేను ఎక్కువగా ఆనందించిన ఘట్టం ఏమిటంటే, పూజా తాతగారిగా శ్రీ బచ్చన్ గారు మొత్తం కుటుంబాన్ని ఒక్కటిగా కలిపి తీసుకురావడానికి ఈ చిన్న ఉపాయాలను ప్రయత్నించడం మరియు గదిని నవ్వులతో నింపేలా మాట్లాడిన సందర్భం” అన్నారు.
 
 
క్యాంపెయిన్ చిత్రం, బ్రాండ్ గొడుగు క్రింద నడిచే క్యాంపెయిన్ ‘దిల్‌దార్‌బనాదే’ వరుసలో మూడవదిగా ఉంది, అది దయ మరియు గొప్పతనం యొక్క విలువలను అందంగా గ్రాహ్యత చేసుకొంది మరియు ఈ సంవత్సరం మొదట్లో ప్రేక్షకులతో ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించింది.  ఈ వేసవిలో, బ్రాండు భారతీయ మార్కెట్లో తన మొట్టమొదటి వేరియంట్ అయిన - ఆమ్ పన్నా‌ని కూడా ప్రవేశపెట్టింది. దశాబ్దాల పాటుగా, అంతులేని మామిడిపళ్ళ అనుభవాన్ని అందించడం ద్వారా మాజా తన వినియోగదారులకు మానసికంగా, శారీరకంగా మరియు స్ఫూర్తి దాయకంగా తాజాదనమునిచ్చింది. ఈ వారసత్వ బ్రాండు, సంవత్సరం పొడవునా దేశవ్యాప్తంగా వేడుకలు, పండుగల క్షణాలన్నింటిలోనూ మరియు తన వినియోగదారుల సంతోషంలోనూ, ఒక కీలకమైన పాత్రను పోషించింది.  ఈ పండుగ సీజనులో, సంతోషదాయకమైన సంబరాల క్షణాలను కలిసికట్టుగా జరుపుకోవడానికి ప్రియమైన వారు సంఘటితం కావాలనీ, ఎప్పటికీ-నిలిచిపోయే బంధాలను సృష్టించే ఆ క్షణాలను ఆనందంగా పంచుకోవాలనీ మాజా ఆశిస్తోంది.