గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (16:57 IST)

కేటీఆర్ తరహా పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు

Mahesh Babu
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ మూడో చిత్రం చేయనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
 
ఇందులో హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
 
అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఐటీ శాఖ మంత్రిగా మహేష్ బాబు పాత్ర ఉందని సమాచారం. అంటే అచ్చం మంత్రి కేటీఆర్ తరహాలో మహేష్ బాబు కూడా ఐటీ శాఖ మంత్రిగా దర్శనం ఇవ్వనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.