RC 15 గురించి కైరా అద్వానీ ఏమన్నదో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది కైరా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ జోడీగా వినయ విదేయ రామ చిత్రంలో మెరిసింది.
ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు కైరా. ప్రస్తుతం ఈ అమ్మడు భూల్ భూలయ్యా 2 సినిమా హిట్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆర్సీ 15 గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వర్క్ చేయడం ప్రత్యేక అనుభవమంటూ చెప్పుకొచ్చింది కైరా.
డైరెక్టర్ శంకర్ ఎలాంటి కథైనా.. పాత్రనైనా అద్భుతంగా మార్చగలరు. సినిమాను మ్యాజిక్ చేస్తాడు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభవం. ఇది తన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నానని అంటూ చెప్పుకొచ్చింది.